ఎస్పీడీసీఎల్‌లో 3,025 ఉద్యోగాలు

రాష్ర్టానికి చెందిన దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పరిధిలోని 3,025 ఉద్యోగాలను భర్తీచేసేందుకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు బుధవారం ఎస్పీడీసీఎల్ సీఎండీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గతంలోనే ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 2,500, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25.. మొత్తంగా 3,025 పోస్టులను భర్తీచేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా పోస్టులు, అర్హతలు, వయసు, దరఖాస్తు విధానం, రిజర్వేషన్లు, ఇతర సమాచారం నోటిఫికేషన్లలో ఇచ్చారు. సంస్థకు చెందిన tssouthpower. cgg. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్…

Read More

ఇరు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన!

దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య మహారాష్ట్ర, యానాం, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తాజా బులెటిన్ లో తెలిపింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Read More

మరింత ఉద్ధృతమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. ఐదో రోజూ డిపోలకే పరిమితమైన బస్సులు

26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. నేడు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ససేమిరా అనగా, మరోవైపు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌పై నేడు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం, భవిష్యత్ పోరాటంపై చర్చించనున్నారు. మరోవైపు, ఐదో రోజు కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందితో పాక్షికంగా బస్సులు నడుపుతోంది.

Read More

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రితో సమావేశం కావడంకోసం గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రితో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు హోదా కల్పించాలని ఇదివరకే అనేకసార్లు ప్రధానిని సీఎం కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పూడిక తీసే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నీతిఆయోగ్ ప్రశంసించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భజలాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఈ పథకానికి ఆర్థిక సహాయం అందించాలని గతంలోనే ప్రధానికి సీఎం…

Read More

వరంగల్‌లో బీజేపీ నిరసన…కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

Dharna

తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ పట్టణంలో ఈరోజు బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనలో అపశృతి చోటు చేసుకుంది. అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఉదయం 11 గంటల సమయంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. బొమ్మపై కిరోసిన్‌ పోస్తున్నప్పుడు ఓ కార్యకర్తపై కిరోసిన్‌ పడింది. అదే సందర్భంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రావడంతో తోపులాట జరగడం, ఆ సమయంలోనే బొమ్మకు నిప్పంటించడంతో కిరోసిన్‌ పడిన శ్రీను అనే కార్యకర్తకు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న పద్మారెడ్డికి కూడా నిప్పంటుకుని ఆమె చేతికి గాయాలయ్యాయి. మరో మహిళా కార్యకర్త చీరకు నిప్పంటుకుని…

Read More