మా నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారు: సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు!

రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, తమ అధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్నీ కోల్పోతున్న కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆయనే పార్టీకి ఓ అతిపెద్ద సమస్యని అభివర్ణించారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా పారిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ఎన్నిక ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్…

Read More

2019లో మహా కూటమి? హస్తినలో జోరుగా సాగుతున్న సంప్రదింపులు

Sonia-Sharad for mahakutami

ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ర్టాలలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల విజయం మరోసారి మహాకూటమిపై చర్చకు తెరతీసింది. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన సమాజ్‌వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇందుకు అనుగుణంగానే యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం రాత్రి నుంచి వివిధ పార్టీల నేతల మధ్య సంప్రదింపులు, చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీల్లో నైతిక స్థయిర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ…

Read More