ఒక్క నెలలోనే 9.73లక్షల కొత్త కొలువులు!

ఉద్యోగుల భవిష్యనిధి కార్యాలయ గణాంకాలప్రకారంచూస్తే గడచిన సెప్టెంబరు నెలలో ప్రభుత్వపరంగానేమి ప్రైవేటురంగంలో అయితేనేమి మొత్తం 9.73లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని స్పస్టం అవుతోంది. ఏడాదికాలంలో ఇదే అత్యంత గరిష్టమైన సంవత్సరంగా చెపుతున్నారు. గడచిన 13నెలల్లో 79.48 లక్షలమందికి ఉపాధి లభించిందని ఇపిఎఫ్‌ఒ వెల్లడించింది. కొత్తగా 79.48 లక్షల మంది కొత్త పిఎఫ్‌చందాదారులు వచ్చారు. సామాజిక భద్రత పథకాలకింద ఇపిఎఫ్‌ఒకు వీరంతా జోడించడం జరిగింది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఈ గణాంకాలున్నాయి. ఈ ఉద్యోగాలన్ని గడచిన 13 నెలల్లోనే సృష్టించినట్లు కనిపిస్తున్నదని ఇపిఎప్‌ఒ వెల్లడించింది. అతితక్కువగా ఈ ఏడాది మార్చినెలలో కేవలం 2.36 లక్షలమంది మాత్రమే ఉన్నారు. వీరికి మాత్రమే ఇపిఎఫ్‌ చందాదారులుగా వచ్చినట్లు తేలింది. ఈ ఏడాదిసెప్టెంబరులో గరిష్టంగా 2.69 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 18-21 ఏళ్ల గ్రూప్‌లో…

Read More