మా నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారు: సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు!

రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, తమ అధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్నీ కోల్పోతున్న కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆయనే పార్టీకి ఓ అతిపెద్ద సమస్యని అభివర్ణించారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా పారిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ఎన్నిక ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్…

Read More

రేపు మేడ్చల్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌,సోనియా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ గాంధీ రేపు మేడ్చల్‌లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తరువాత రోడ్డు మార్గం ద్వారా 5.30గంటలకు మేడ్చల్ సభాస్థలికి చేరుకుంటారు. కాగా. సభ వద్ద రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల కోసం ఒకటి, అభ్యర్ధుల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక రాహుల్ ప్రసంగం మొత్తం 10లక్షల మందికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More

మోదీని టార్గెట్‌ చేసిన రాహుల్‌

Rahul Gandhi takes on Modi govt over Aadhaar linking

వ్యక్తిగత గోప్యత విషయంలో కీలకంగా మారిన ఆధార్‌ కార్డుపై సుప్రీంకోర్టు తన విచారణను గురువారం కొనసాగించనున్న నేపథ్యంలో ఈ అంశంపై రాజకీయంగా వాడీవేడి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాహుల్‌గాంధీ ‘ఆధార్‌’ విషయంలో మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. యూపీఏ హయాంలో ఆధార్‌ ఎలా ఉండేది.. ఎన్డీయే హయాంలో ఎలా మారింది అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. యూపీఏ హయాంలో దేశపౌరుల సాధికారితకు స్వచ్ఛంద సాధనంగా ఆధార్‌ ఉండగా.. ఎన్డీయే ప్రభుత్వానికి వచ్చేసరికి దేశపౌరులను బలహీనులను చేసే బలవంతపు ఆయుధంగా ఆధార్‌ మారిపోయిందని విమర్శించారు. కనీస సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాహుల్‌ కేంద్రంపై ఈ విమర్శలు చేశారు. బ్యాంకులు, మొబైల్‌ఫోన్లు, పాన్‌కార్డులు, ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని ప్రభుత్వం కచ్చితం చేసేదిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. TAGS: narendra modi, rahul…

Read More