మరింత ఉద్ధృతమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. ఐదో రోజూ డిపోలకే పరిమితమైన బస్సులు

26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. నేడు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ససేమిరా అనగా, మరోవైపు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌పై నేడు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం, భవిష్యత్ పోరాటంపై చర్చించనున్నారు. మరోవైపు, ఐదో రోజు కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందితో పాక్షికంగా బస్సులు నడుపుతోంది.

Read More

మోదీ ముందు 22 డిమాండ్లు ఉంచిన కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నిమిషాల పాటు వీరిరువురూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 22 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి కేసీఆర్ అందించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ. 450 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఇంకా ఒక ఏడాది నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. ఒక ఐఐఎంను మంజూరు చేయాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని విన్నవించారు. నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లను విడుదల చేయాలని కోరారు.…

Read More

కారెక్కిన కాంగ్రెస్

రాష్ట్ర కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకంలేని ఆ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఇప్పటివరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఇదే రుజువైందని, తాము కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావడానికి టీఆర్‌ఎస్‌లో విలీనమవ్వాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఈ మేరకు తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ గురువారం ఉదయం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి లేఖ ఇచ్చారు. తమను రాజ్యాంగబద్ధంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని కోరారు. అసెంబ్లీలో ఏదైనా పార్టీ సభ్యులు మరో పార్టీలో విలీనం కావాలంటే.. మూడింట రెండొంతుల మంది సుముఖత వ్యక్తంచేస్తూ స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే విధంగా టీఆర్‌ఎస్‌ఎల్పీలో…

Read More

సఫల తెలంగాణ

దేశచరిత్రలోనే ఎన్నదగిన మహోద్యమాన్ని సాగించి సాధించుకొన్న తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేండ్లు చిన్నకాలమే అయినప్పటికీ ప్రభుత్వం సాధించిన అసామాన్య విజయాల రీత్యా ఎంతో విలువైన కాలమని పేర్కొన్నారు. కాళేశ్వరంతోపాటు రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించదు.. కనిపించదని సీఎం తెలిపారు. రెండున్నరేండ్ల అతి తక్కువ సమయంలో నిర్మిస్తున్న అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించబోతున్నదన్నారు. వచ్చేనెల చివరినుంచి మేడిగడ్డ బరాజ్ నుంచి ప్రతిరోజు రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతికి ఎంతమాత్రం చోటులేకుండా కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చి పారదర్శకమైన పాలనను అందిస్తామన్నారు. కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడుతామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తనకు సంతృప్తినిచ్చిన ఆసరా పింఛన్లను జూలై ఒకటి…

Read More

ఆ తండాకు సీఎం కేసీఆర్ పేరు

ఆ తండా వాసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తూ 2018 ఆగస్టు 2వతేదీన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గిరిజన తండా వాసులు ప్రత్యేక అభిమానాన్ని చాటుతున్నారు. ఏన్నో ఏళ్లుగా ‘మా తండాలో మా రాజ్యం’ అంటూ నినదిస్తున్న గిరిజనులు టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తుండగా… ప్రభుత్వాధినేత అయిన కేసీఆర్ పేరును ఓ తండాకు ఏర్పాటుచేసుకోవడం విశేషం. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో ఓ తండాకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Read More