APPSC Recruitment Notification: ఏపీలో కొలువుల జాతర.. త్వరలో మరో 14 నోటిఫికేషన్లు

APPSC Recruitment Notification-s9Tv

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే 21 నోటిఫికేషన్ల ద్వారా 3,225 పోస్టుల్ని భర్తీ చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు లోపు 1500 ఉద్యోగాల భర్తీకి 14 నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్. నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌తో పాటు ఖాళీల వివరాలను భిన్నంగా క్యారీ ఫార్వర్డ్‌ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు ఉదయ్ భాస్కర్. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తులకు గడువు ఉందని.. ఆ పోస్టులకు మొత్తం 56,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. పోస్టులకు చివరి నిమిషంలో దరఖాస్తులు చేయడం వల్ల సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని.. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.…

Read More

టెక్‌, ఈ-కామర్స్‌ సంస్థల ఉద్యోగ మేళా : 40 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం

టెక్నాజీ స్టార్టప్‌ కంపెనీలు, ఈ-కామర్స్‌ దిగ్గజాలు కొత్త ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా సరికొత్త పెట్టుబడులకు సిద్ధమవుతున్న సంస్థలు ఉద్యోగుల సంఖ్యను 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించాయి. ఉద్యోగార్థులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. హెల్తియన్స్‌, మిల్క్‌ బాస్కెట్‌, కార్స్‌ 24, ఇస్టామోజో, మో ఎంగేజ్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించాయని సమాచారం. 2018లో ఉద్యోగ కల్పనలో 55 శాతం వృద్ధి నమోదు చేశాయి. పెరుగుతున్న అవసరాల రీత్యా ప్రస్తుతం చాలా సంస్థలు సొంత టెక్నాలజీ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఆహార సరఫరా, ఈ కామర్స్‌ వంటి సంస్థలు ముందున్నాయి. మార్కెట్లో పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న జొమాటో, ఓయో, స్విగ్గీ వంటి సంస్థలు ఉద్యోగుల సంఖ్యను 30 శాతం పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయని సమాచారం.

Read More

ఒక్క నెలలోనే 9.73లక్షల కొత్త కొలువులు!

ఉద్యోగుల భవిష్యనిధి కార్యాలయ గణాంకాలప్రకారంచూస్తే గడచిన సెప్టెంబరు నెలలో ప్రభుత్వపరంగానేమి ప్రైవేటురంగంలో అయితేనేమి మొత్తం 9.73లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని స్పస్టం అవుతోంది. ఏడాదికాలంలో ఇదే అత్యంత గరిష్టమైన సంవత్సరంగా చెపుతున్నారు. గడచిన 13నెలల్లో 79.48 లక్షలమందికి ఉపాధి లభించిందని ఇపిఎఫ్‌ఒ వెల్లడించింది. కొత్తగా 79.48 లక్షల మంది కొత్త పిఎఫ్‌చందాదారులు వచ్చారు. సామాజిక భద్రత పథకాలకింద ఇపిఎఫ్‌ఒకు వీరంతా జోడించడం జరిగింది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఈ గణాంకాలున్నాయి. ఈ ఉద్యోగాలన్ని గడచిన 13 నెలల్లోనే సృష్టించినట్లు కనిపిస్తున్నదని ఇపిఎప్‌ఒ వెల్లడించింది. అతితక్కువగా ఈ ఏడాది మార్చినెలలో కేవలం 2.36 లక్షలమంది మాత్రమే ఉన్నారు. వీరికి మాత్రమే ఇపిఎఫ్‌ చందాదారులుగా వచ్చినట్లు తేలింది. ఈ ఏడాదిసెప్టెంబరులో గరిష్టంగా 2.69 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 18-21 ఏళ్ల గ్రూప్‌లో…

Read More