కోల్ కతాలో మూడుకు చేరిన కరోనా బాధితుల సంఖ్య

భారత్ లోనూ (కోవిడ్-19) కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కోల్ కతా లో మూడో కరోనా కేసు నమోదైంది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మరో వ్యక్తికి నావల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ చేశారు. ఈ మేరకు విమానాశ్రయా అధికారులు ఒక ప్రకటన చేస్తూ.. బ్యాంకాక్ నుంచి కోల్ కతా చేరుకున్న ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిందని తెలిపారు. ఈ తాజా కేసుతో కోల్ కతాలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వారంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలారని చెప్పారు. పాజిటివ్ గా తేలిన వారిని బలియాఘటా ఐడి అస్పత్రికి పంపినట్లు అధికారులు వెల్లడించారు.…

Read More

ఉల్లిధర క్వింటాల్‌కు రూ. 2,000 చేరిక!

దేశాన్ని కుదిపేసిన ఉల్లిధరలు పూర్తిగా దిగివస్తున్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భారీఎత్తున దిగుమతులు పెరిగిపోవడంతో ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హోల్‌సేల్‌ మార్కెట్‌లలో క్వింటాల్‌కు 2000 నుంచి 2500 రూపాయలకు చేరింది. రిటైల్‌ మార్కెట్‌లోనూ కిలో ఉల్లిగడ్డ 25 నుంచి 30 రూపాయలకు దిగి వచ్చింది. ఒక దశలో ఏకంగా కిలో 200 రూపాయలు పలికిను ఉల్లిగడ్డ ప్రస్తుతం భారీగా తగ్గింది. హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లయిన మలక్‌పేట,బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌తో పాటు బేగంబజార్‌కు భారీ ఎత్తున ఉల్లిదిగుమతి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఉల్లి నగరానికి దిగుమతి అవుుతోంది. దాంతో పాటు కర్నాటక నుంచి కొంత మేరకు ఉల్లి అవసరాలు తీరుస్తున్నాయి. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ ఉల్లి దిబడి బాగా పెరిగింది. నగరానికి భారీఎత్తున దిగుమతి…

Read More

టీ20ల్లో గఫ్తిల్‌ను వెనక్కి నెట్టేసిన మిథాలీ

మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ ఓపెనర్‌ మిథాలీ రాజ్‌ వరుస రికార్డులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ(2207)ను అధిగమించిన మిథాలీ.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అర్ధశతకంతో మరో ఘనత వహించింది. అదే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మార్టిన్‌ గఫ్తిల్‌ను దాటుకోవడం. ప్రస్తుతం గఫ్తిల్‌ 2271 పరుగులతో అందరికంటే ముందు వరుసలో ఉండగా.. తాజాగా మిథాలీ(2283) అతనిని కూడా వెనక్కి నెట్టేసింది. అధిగమించింది.

Read More

పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్.. షెడ్యూల్‌పై బీసీసీఐ ఆగ్రహం

pakistan vs india cricket match shedul bcci

ఆసియా కప్ క్రికెట్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ టోర్నమెంట్‌లో సెప్టెంబర్ 19న దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనున్నది. అయితే షెడ్యూల్‌ను తయారు చేసిన తీరును బీసీసీఐ తప్పుపట్టింది. భారత్‌కు వరుసగా రెండు రోజులు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది, ఇది ఎలా సాధ్యమని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. ఆసియా కప్ టోర్నీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూపులో పాకిస్థాన్, భారత్‌తో పాటు ఓ క్వాలిఫయర్ టీమ్ ఉంటుంది. ఇక బీ గ్రూపులో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన బంగ్లా, లంక మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక 18వ తేదీన క్వాలిఫయర్ జట్టుతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత రోజే 19న మళ్లీ పాకిస్థాన్‌తో భారత్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ అభ్యంతరం…

Read More

దేశంలోనే ధనిక ఎంపీ ఎవరో తెలుసా ? కళ్లు చెదిరేలా రెట్టింపైన ఆస్తులు

రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటించారు. 58 స్థానాల కోసం మార్చి 23న జరుగనున్న ఎన్నికకు సంబంధించి.. సోమవారంతో నామినేషన్ల గడువు పూర్తైంది. మంగళవారం(13న) నామినేషన్ల పరిశీలన చేపడతారు. వీటిలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కాబోతుండటం తెలిసిందే. కాగా, ఈ సందర్భంలోనే.. ‘దేశంలోనే ధనిక ఎంపీ’ కిరీటం తలమారుతుండటం గమనార్హం. ఇన్నాళ్లూ రవీంద్ర కిశోర్‌ సిన్హాకు దక్కిన ఆ ప్రత్యేకత ఇకపై జయా బచ్చన్ సొంతంకానుంది. అవును. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1000కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన ఆమె దేశంలోనే ధనిక ఎంపీగా నిలవబోతున్నారు. జయా బచ్చన్‌ సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇందుకోసం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనతోపాటు భర్త అమితాబ్‌వి కలిపి రూ.1000 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. అదే 2012లో ఆమె తన ఆస్తిని రూ.460…

Read More