సీరియల్ నటి దారుణ హత్య… పది రోజుల తర్వాత వెలుగులోకి…

ఓ సీరియల్ నటిని తన భర్త దారుణంగా హత్య చేశాడు. తన మిత్రుడితో కలసి ఆమెను అంతం చేశాడు. అనంతరం ఆమె శవం కూడా కనిపించకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఢిల్లీకి చెందిన అనిత సీరియల్ నటి. పలు టీవీ షోల్లో నటిస్తూ ఉంటుంది. అయితే, ఆమెకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త రవీంద్రపాల్ అనుమానం. ఈ క్రమంలో తన భార్యను చంపాలని అతడు పథకం పన్నాడు. జనవరి 30న ఆమెను తీసుకుని బస్సులో వెళ్లాడు. తనకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు ముంబైలో టీవీ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటాడని చెప్పాడు. అతడిని కలిస్తే టీవీ సీరియల్స్‌లో మంచి అవకాశాలు రావడంతో పాటు, కెరీర్ బాగా పుంజుకుంటుందని ఆమెను నమ్మించాడు. భర్త చెప్పిన మాటలు విన్న అనిత అతడితో కలసి…

Read More

నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు నోటీసులు… ఉరి వేసేది ఎప్పుడు?

ఢిల్లీ నిర్భయ కేసులో దోషులకు ఉరి వేయాలనుకున్న కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టడంతో… ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టాలంటూ… కేంద్రం పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై ఈ కేసులో దోషులైన నలుగురికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిజానికి ఈ కేసులో దోషులకు ఉరి అంశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. దాంతో ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ… కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు… కింది కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే… ఉరి ఎప్పుడు వెయ్యాలో నెక్ట్స్ డేట్ ఫిక్స్ చెయ్యమని ట్రయల్ కోర్టును కేంద్ర అధికారులు కోరవచ్చని తెలిపింది. సో, ఇప్పుడు ట్రయల్ కోర్టు నిర్ణయం కీలకం కాబోతోంది. వాయిదా ఎందుకు వేసిందంటే : నిర్భయ దోషులు… ఒకరి తర్వాత ఒకరుగా క్షమాభిక్ష…

Read More

రాజ్యసభలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

:రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన శ్రేయస్కరం కాదని, పరోక్ష పద్ధతుల్లో నిధులు సేకరించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సరికాదని చెప్పారు. పన్నుల వసూళ్ల ద్వారా రూ.1.50లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలన్న… గత బడ్జెట్‌ లక్ష్య సాధనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విజయసాయి విమర్శించారు. Tags : vijayasai reddy , mp ysrcp , lic rajyasabha , delhi ,

Read More

299కే స్వచ్ఛ ఆక్సిజన్‌

న్యూఢిల్లీ: రూ.299 చెల్లించండి.. 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ పీల్చుకోండి. విచిత్రంగా అనిపించి నా ఇది నిజం. ఢిల్లీలో వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ‘ఆక్సీ ప్యూర్‌ సంస్థ’ స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిస్తామని ముందుకొచ్చింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలోని సాకేత్‌లో సిటీ వాక్‌ మాల్‌ లో ఓ ఆక్సిజన్‌ బార్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో ఏడు ఫ్లేవర్లు కూడా ఉన్నాయి. స్పియర్‌మింట్‌, పిప్పర్‌మింట్‌, సిన్నామన్‌, ఆరంజ్‌ వంటి ఏడు సుగంధ ద్రవ్యాల సువాసనల్లో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ప్రాణ వాయువును ఆస్వాదించవచ్చని సంస్థ చెప్తున్నది. ఇక్కడ ఒక వ్యక్తికి రోజులో ఒకసారి మాత్రమే ఆక్సిజన్‌ను సరఫరా చేస్తారు. ఆక్సిజన్‌ బార్లు మనకు కొత్తే అయినా.. చాలా దేశాల్లో ఇవి ఏండ్లుగా నడుస్తున్నాయి. స్వచ్ఛ ప్రాణవాయువును పీల్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందిదని నిర్వాహకులు చెప్తున్నారు.

Read More

2019లో మహా కూటమి? హస్తినలో జోరుగా సాగుతున్న సంప్రదింపులు

Sonia-Sharad for mahakutami

ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ర్టాలలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల విజయం మరోసారి మహాకూటమిపై చర్చకు తెరతీసింది. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన సమాజ్‌వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇందుకు అనుగుణంగానే యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం రాత్రి నుంచి వివిధ పార్టీల నేతల మధ్య సంప్రదింపులు, చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీల్లో నైతిక స్థయిర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ…

Read More