సీరియల్ నటి దారుణ హత్య… పది రోజుల తర్వాత వెలుగులోకి…

ఓ సీరియల్ నటిని తన భర్త దారుణంగా హత్య చేశాడు. తన మిత్రుడితో కలసి ఆమెను అంతం చేశాడు. అనంతరం ఆమె శవం కూడా కనిపించకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఢిల్లీకి చెందిన అనిత సీరియల్ నటి. పలు టీవీ షోల్లో నటిస్తూ ఉంటుంది. అయితే, ఆమెకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త రవీంద్రపాల్ అనుమానం. ఈ క్రమంలో తన భార్యను చంపాలని అతడు పథకం పన్నాడు. జనవరి 30న ఆమెను తీసుకుని బస్సులో వెళ్లాడు. తనకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు ముంబైలో టీవీ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటాడని చెప్పాడు. అతడిని కలిస్తే టీవీ సీరియల్స్‌లో మంచి అవకాశాలు రావడంతో పాటు, కెరీర్ బాగా పుంజుకుంటుందని ఆమెను నమ్మించాడు. భర్త చెప్పిన మాటలు విన్న అనిత అతడితో కలసి…

Read More

నేర చరితుల సంగతేంటి? రాజకీయ పార్టీలను ఉతికారేసిన సుప్రీంకోర్టు

మంచి నేతలు ఉన్న దేశం మంచిగా అభివృద్ధి చెందుతుంది. అదే నేర చరిత్ర ఉన్న వాళ్లు నేతలైతే… కొంపలు మునుగుతాయి. ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అదే జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నేర చరిత్ర ఉన్న వాళ్లను ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టడం చట్ట ప్రకారం నేరం కాబట్టి… రాజకీయ పార్టీలు అలా చేస్తే… అవి చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రూల్ ఎవరైనా అతిక్రమిస్తే… కేంద్ర ఎన్నికల సంఘం కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు రాజకీయ పార్టీలు ఇప్పటివరకూ నేర చరిత్ర ఉన్నవారిని ఎందుకు ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడుతున్నాయో చెప్పాలని సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం… సంచలన తీర్పు ఇచ్చింది. అభ్యర్థులుగా నిలబడే వారంతా… తమ నేర…

Read More

మాదాపూర్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ హారిక తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా గంజాంలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మీ(25) అనే యువతి కొంతకాలంగా గుట్టల బేగంపేటలోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే మంగళవారం హాస్టల్‌లోని రూమ్‌మేట్స్ విధులకు వెళ్లగా, ఆ సమయంలో రాజ్యలక్ష్మీ చున్నితో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో రూమ్ మేట్ నవీన హాస్టల్ గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మీ ఫ్యాన్‌కు ఉరేసుకుని కన్పించింది. దాంతో హాస్టల్ నిర్వాహకులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే రాజ్యలక్ష్మీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలవాల్సి ఉందని పోలీసులు చెప్పారు. Tags : crime…

Read More

నెల్లూరులో నర్సుకు వేధింపులు… ఆమ్లేట్ వేసుకొని రాత్రి రమ్మన్న డాక్టర్

ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న ఆడవారిపై వేధింపులు మాత్రం ఆగడంలేదు. బస్సుల్లోనే, స్కూళ్లలోనే, పనిచేేేసే ఆఫీసుల్లోనూ.. ఆడవారికి లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా మరొ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో నలుగురికి సేవ చేసే వైద్య వృత్తిలో ఉన్న డాక్టరే తన దగ్గర పనిచేసే సిబ్బందిని వేధింపులకు గురి చేశాడు. స్టాఫ్ నర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం… ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లిన స్టాఫ్ నర్సుకు కాల్ చేశాడు. తనకు ఆమ్లేట్ కావాలన్నాడు. దీంతో నర్సు సరేనంటూ… ఆస్పత్రి సిబ్బందిని పంపిస్తే… ఆమ్లేట్ వేసి పంపుతానంటూ తెలిపింది. దీనికి ఆయన లేదు నువ్వే తీసుకురావాలన్నారు. సరే తమ ఆస్పత్రి…

Read More

హైదరాబాద్‌లో దారుణం… ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాల్‌ కేశంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి ,నిఖిత భార్యాభర్తలు. వీరికి యత్వంత్ రెడ్డి అనే రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కొంత కాలంగా బీఎన్‌రెడ్డినగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వెంకట్‌రెడ్డి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. వచ్చిన జీతం చాలాక…. కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు వీరి కుటుంబం బాధపడుతుంది. దీంతో భార్యభర్తలిద్దరూ కుంగిపోయారు. ఎవరి దగ్గర చేయిచాచి అడుగుతాంలే అనుకున్నారు. తమలో తమే మదనపడ్డారు. తమ కష్టాన్ని కన్నవాళ్లకు సైతం చెప్పుకోలేదు. ఇద్దరు కుంగిపోయారు. బతకలేక చావాలనుకొని నిశ్చయించుకున్నారు. దీంతో కలిసి నిండు నూరేళ్లు బతకాల్ని ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం…

Read More