ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ.. వివరాలు ఇలా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో తాత్కాలిక నియామకాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. రోజువారీ ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను తీసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆర్టీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో డ్రైవర్, కండక్టర్ పోస్టులతోపాటు పలు పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన ధ్రువపత్రాలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీపంలోని డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. పోస్టుల ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ విధానంలో పారితోషికం చెల్లిస్తారు. పోస్టుల వివరాలు… ➥ డ్రైవర్ ➥ కండక్టర్ ➥ మెకానికల్ సూపర్ వైజర్స్ ➥ మెకానిక్ ➥ శ్రామిక్ ➥ ఎలక్ట్రీషియన్ ➥ టైర్ మెకానిక్ ➥ క్లరికల్ సిబ్బంది ➥ ఐటీ ట్రైనర్

Read More

ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం

ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసి సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. దీంతో వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం కూడా నిలిచిపోయింది. మరోవైపు కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Read More