నేడు హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ సభ

ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్‌లో నిర్వహించే ఉప ఎన్నికల బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం టీఆర్‌ఎస్ శ్రేణు లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటం, బహిరంగసభకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో ప్రచారం మరింత జోరందుకోనున్నది. ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. మిగతా పార్టీల కంటే కూడా దూసుకుపోతున్నది. అభ్యర్థి సైదిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు చుట్టిరాగా, మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,…

Read More

హుజూర్‌నగర్‌లో 17న సీఎం సభ

హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 17న టీఆర్‌ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హాజరవుతారని ఆ పార్టీ ఉపఎన్నిక ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సాయిబాబా థియేటర్‌రోడ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సీ ఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను సోమవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ, పార్టీ ఉపఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, సూర్యాపేట జెడ్పీ చైర్‌పర్సన్ దీపికాయుగంధర్‌తో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌కు ఇప్పటివరకు చేసిన, తర్వాత…

Read More

ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం

ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసి సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. దీంతో వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం కూడా నిలిచిపోయింది. మరోవైపు కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Read More

వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌

విజయదశమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో వాహన , ఆయుధ పూజలు నిర్వహించారు. ఆయుధపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఉద్యోగులు, కుటుంబసభ్యులకు సీఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read More

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రితో సమావేశం కావడంకోసం గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రితో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు హోదా కల్పించాలని ఇదివరకే అనేకసార్లు ప్రధానిని సీఎం కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పూడిక తీసే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నీతిఆయోగ్ ప్రశంసించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భజలాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఈ పథకానికి ఆర్థిక సహాయం అందించాలని గతంలోనే ప్రధానికి సీఎం…

Read More