ఇరు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన!

దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య మహారాష్ట్ర, యానాం, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తాజా బులెటిన్ లో తెలిపింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Read More

సభకు వెళ్లినా, వెళ్లకపోయినా నష్టమేమీ లేదు..జేసీ

JC DIVAKAR REDDY LOKSABHA COMENTS

ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాను అవిశ్వాస తీర్మానంపై చర్చ రోజు పార్లమెంట్‌కు వెళ్లబోనని స్పష్టంచేశారు.తొలి రోజు కూడా ఆయన లోక్‌సభకు హాజరుకాలేదు ఇక ఈ సమావేశాలు అయిపోయేవరకు వెళ్లకూడదనే ఆయన నిర్ణయం తీసుకున్నార. ఇప్పటికే అందరు ఎంపీలు కచ్చితంగా హాజరు కావాలని టీడీపీ విప్ జారీ చేసింది. ఈ విప్‌ను కూడా జేసీ లైట్ తీసుకున్నారు ఇవన్నీ రొటీనే అంటూ కొట్టి పారేశారు. ప్రభుత్వం ఎలాగూ కూలిపోదు.. అయినా నాకు ఇంగ్లిష్ రాదు.. హిందీ రాదు.. ఇక నేను సభకు వెళ్లినా, వెళ్లకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు. సభలో బాగా మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు చూసుకుంటారు అని జేసీ అనడం గమనార్హం.   TAGS: TDP , MP JC Diwakar Reddy , Andhra Pradesh , Chandra Babu Naidu ,

Read More

గర్ల్‌ ఫ్రెండ్‌ను కామెంట్‌ చేశాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసిన మైనర్ బాలుడు

నరసాపురంలో ఇద్దరు మైనర్లు ఘాతుకానికి ఒడికట్టారు. ఏదో సందర్భంలో తన గర్ల్‌ ఫ్రెండ్‌ను కామెంట్‌ చేశాడనే అక్కసుతో ఓ మైనర్‌ బాలుడు, తన స్నేహితుడైన మరో మైనర్‌తో కలసి పట్టణంలోని ప్రకాశం రోడ్డులో ఉన్న గడ్డియ్య టీ సెంటర్‌లో పనిచేసే దండు గంగరాజు (30)ను మెడకు తాడు బిగించి హత్య చేసి శవాన్ని గోదావరిలో పడేశారు. నిందితులిద్దరూ అదే టీకొట్టులో పని చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత హత్యాఘాతుకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. నరసాపురం డీఎస్పీ టీటీ ప్రభాకర్‌బాబు గురువారం తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.  పట్టణంలోని పీచుపాలెం దాటిన తర్వాత రూరల్‌ పరిధిలో గోదావరిలో శవాన్ని గత అక్టోబర్‌ 12న కనుగొన్నారు. మృతుడు పట్టణంలోని టీకొట్టులో పనిచేసే గంగరాజుగా గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లాకు…

Read More