చిదంబ‌రానికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఊర‌ట ల‌భించింది. ఇవాళ సుప్రీంకోర్టు చిదంబ‌రానికి బెయిల్ మంజూరీ చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో.. మాజీ కేంద్ర మంత్రి బెయిల్ కోసం సుప్రీం త‌ల‌పు త‌ట్టారు. అయితే ఇవాళ సుప్రీం బెయిల్ ఇచ్చినా.. కాంగ్రెస్ నేత మాత్రం ఇంకా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ క‌స్ట‌డీలోనే ఉన్నారు. ఇద్ద‌రు సాక్షి సంత‌కాల‌తో చిదంబ‌రం.. ల‌క్ష రూపాయాల బాండ్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. చిదంబ‌రం త‌న పాస్‌పోర్ట్‌ను ట్ర‌య‌ల్ కోర్టులో అప్ప‌గించాలి. కోర్టు అనుమ‌తితోనే ఆయ‌న విదేశాల‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ‌కు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో విదేశీ పెట్టుబ‌డులు అందే విధంగా చిదంబ‌రం అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఈ ఏడాది ఆగ‌స్టు 21వ తేదీన చిదంబ‌రాన్ని అరెస్టు చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీహార్…

Read More

Postal Jobs: 3677 పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో 3677 పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం (అక్టోబరు 22) ప్రారంభమైంది. అక్టోబరు 14న రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి నవంబరు 14 వరకు అవకాశం ఉంది. ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ…

Read More

టీవీల చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్టు

మల్కాజ్‌గిరి, మేడిపల్లి పరిధిలో టీవీల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 లక్షల రూపాయల విలువైన 23 ఎల్‌ఈడీ టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే వారిపై తక్షణమే తమకు సమాచారమివ్వాలని వారు తెలిపారు. కాగా, ఈ దొంగల గురించి చాలా రోజులుగా గాలిస్తున్నామనీ, ఎట్టకేలకు ఈ రోజు చిక్కారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More

ప్రభుత్వానికి చేరిన హైకోర్టు ఆర్డర్ కాపీ.. నివేదిక తయారు చేయాలంటూ కేసీఆర్ ఆదేశం

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ టీఎస్ ప్రభుత్వానికి అందింది. ఆర్డర్ కాపీ అందిందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి… ఆర్డర్ లో ఏముందనే విషయంపై అధ్యయనం చేసి, అధికారులతో సాధ్యాసాధ్యాలపై చర్చించి వెంటనే నివేదిక తయారు చేయాలని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రధాన సలహారుడు రాజీవ్ శర్మను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో, రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఇతర ముఖ్య అధికారులతో ప్రగతి భవన్ లో రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం 3 గంటలకు కోర్టు తీర్పు, ఇతర అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అనంతరం ఆర్టీసీకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Read More

ఓటు హక్కును వినియోగించుకున్న సచిన్

మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య అంజలి, కుమారుడు అర్జున్ కూడా ఓటు వేశారు. ముంబైలోని బాంద్రా (వెస్ట్)లోని పోలింగ్ బూత్ లో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో సచిన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి బయటకు వచ్చి, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తను మార్చగలిగే సత్తా ఓటర్లకు ఉందని చెప్పారు. సమాజానికి మంచి చేస్తారని ఎవరినైతే మీరు నమ్ముతారో, వారికి ఓటు వేయండని పిలుపునిచ్చారు. అర్హులైన వారిని ఎన్నుకోవాలని కోరారు.

Read More