‘మాజీ టీడీపీ నేతలకు బీజేపీలో ప్రాధాన్యం హాస్యాస్పదం’

కొన్ని మాసాల క్రితం ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు బీజేపీ తీర్థంపుచ్చుకోవడం తెలిసిందే. ఇన్ని రోజులు సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఐవైఆర్.. ఇప్పుడు సొంత పార్టీని కూడా విడిచిపెట్టడం లేదు. టీడీపీ మాజీ నేతలకు బీజేపీలో దక్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం ఏపీలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు ఆ పార్టీలో అధిక ప్రాధాన్యం దక్కడంపై ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. టీడీపీలో ఉన్న రోజుల్లో బీజేపీని, ప్రధాని మోడీని హద్దులు, పద్దులు లేకుండా దూషించిన వ్యక్తులే నేడు బీజేపీ ప్రతినిధులుగా టీవీ షోలలో వస్తున్నారన్నారు. ఇది హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. వారిని అలా టీవీ షోలకు పంపించటానికి పార్టీ ప్రతినిధులు లేక బీజేపీ గొడ్డు పోయిందా? అన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు.

కాగా వైసీపీ నేత ఒకరు తనకు ఫోన్ చేసి టీడీపీకి చెందిన వారిపై జరిగిన ఐటీ రైడులపై ట్వీట్ చేయమని అడిగారని ఐవైఆర్ వెల్లడించారు. తన ట్వీట్లు వైసీపీ అంచనాలకు, టీడీపీ అంచనాలకు అతీతంగా ఉంటాయని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.

Related posts

Leave a Comment