కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ అభిషేకం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు సీఎం కేసీఆర్‌ పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలిన కేసీఆర్‌.. చీర, సారె సమర్పించారు. సీఎం కేసీఆర్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. మరికాసేపట్లో లక్ష్మీబరాజ్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. అనంతరం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు సీఎం కేసీఆర్‌.

Tags : CM KCR , Kaleshwaram , laxmi barrage , Mukteswara swamy , godavari

Related posts

Leave a Comment