జమ్మూకాశ్మీర్‌లో తిరుమల ఆలయం…

thirumala

తెలుగువారు, తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఆనందం కలిగించే విషయం ఇది. ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్న జమ్మూకాశ్మీర్‌లో తిరుమల తరహాలో ఓ శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD రెడీ అవుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి ఆల్రెడీ అనుమతులు వచ్చేశాయి. ఇందుకోసం మొత్తం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిసింది. ఈ స్థలం జమ్మూ-కత్తా హైవే పక్కన ఉన్నట్లు తెలిసింది. ప్లాన్ ప్రకారం… రెండేళ్లలో ఈ ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ఆలయంతోపాటూ… 100 ఎకరాల స్థలంలోనే ఓ వేద పాఠశాల, ఓ కల్యాణ మంటపం, ఓ హాస్పిటల్ కూడా నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఈ ఆలయ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో టీటీడీ బోర్డు ప్రతినిధి బృందం చర్చించగా… వెంటనే ప్రభుత్వం… ఆలయ ఏర్పాటు దిశగా జమ్మూకాశ్మీర్‌లో సంప్రదింపులు, చర్చలు జరిపింది. తిరుమలకు ఎక్కువగా దక్షిణాది, మధ్య రాష్ట్రాల భక్తులు వస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల భక్తులు సందర్శించేందుకు వీలుగా కాశ్మీర్‌లో ఆలయాన్ని నిర్మించబోతుండటం విశేషం.

ఆలయ నిర్మాణం కోసం టీటీడీ బోర్డు నిధులు కేటాయించనుంది. అలాగే భక్తుల నుంచి కూడా నిధులు సమీకరించబోతున్నట్లు తెలిసింది. జమ్మూకాశ్మీర్‌లో నిర్మించే ఆలయం చుట్టుపక్కల అంతా ప్రశాంత వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అలాగే భద్రత విషయంలోనూ అత్యంత పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులకు నీరు, రవాణా సహా అన్ని సదుపాయాలూ కల్పించనున్నారు.

ఈ ఆలయంతోపాటూ… ముంబైలోనూ మరో తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం బాంధ్రాలో భూమిని కేటాయించింది. అక్కడ రూ.30కోట్లతో ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలిసింది.

Tags : AP News , Jammu and Kashmir , telugu news , tirumala news , Tirumala Temple

Related posts

Leave a Comment