మాదాపూర్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ హారిక తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా గంజాంలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మీ(25) అనే యువతి కొంతకాలంగా గుట్టల బేగంపేటలోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే మంగళవారం హాస్టల్‌లోని రూమ్‌మేట్స్ విధులకు వెళ్లగా, ఆ సమయంలో రాజ్యలక్ష్మీ చున్నితో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో రూమ్ మేట్ నవీన హాస్టల్ గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మీ ఫ్యాన్‌కు ఉరేసుకుని కన్పించింది. దాంతో హాస్టల్ నిర్వాహకులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే రాజ్యలక్ష్మీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలవాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Tags : crime , crime news , madhapur , softwere , suside ,

Related posts

Leave a Comment