బాలికపై లైంగిక వేధింపులు.. బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు

బాలికను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ నటుడు షహ్బాజ్ ఖాన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. షహ్బాజ్ ఖాన్ పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలతో పాటు ఒక చైనీస్ సినిమాలో నటించాడు. వీటితో పాటు పంజాబీ, గుజరాతీ, కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ ఆమిర్ ఖాన్ కుమారుడే షహ్బాజ్ ఖాన్.

Tags : Shahbaz Khan , Bollywood , Case , Molesting

Related posts

Leave a Comment