నెల్లూరులో నర్సుకు వేధింపులు… ఆమ్లేట్ వేసుకొని రాత్రి రమ్మన్న డాక్టర్

ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న ఆడవారిపై వేధింపులు మాత్రం ఆగడంలేదు. బస్సుల్లోనే, స్కూళ్లలోనే, పనిచేేేసే ఆఫీసుల్లోనూ.. ఆడవారికి లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా మరొ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో నలుగురికి సేవ చేసే వైద్య వృత్తిలో ఉన్న డాక్టరే తన దగ్గర పనిచేసే సిబ్బందిని వేధింపులకు గురి చేశాడు. స్టాఫ్ నర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం… ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లిన స్టాఫ్ నర్సుకు కాల్ చేశాడు. తనకు ఆమ్లేట్ కావాలన్నాడు. దీంతో నర్సు సరేనంటూ… ఆస్పత్రి సిబ్బందిని పంపిస్తే… ఆమ్లేట్ వేసి పంపుతానంటూ తెలిపింది. దీనికి ఆయన లేదు నువ్వే తీసుకురావాలన్నారు. సరే తమ ఆస్పత్రి డాక్టరే కదా అని… ఆమ్లేట్ వేసుకొని మళ్లీ ఆస్పత్రికి వచ్చింది నర్సు. దీంతో ఆమెను మేడపైకి తన గదిలోకి రావాలని కోరాడు. అక్కడకు వెళ్లిన ఆమెను తనతో పాటు పదినిమిషాల పాటు గడపాలన్నాడు. డాక్టర్ రవీంద్ర మాటలు విన్న బాధితురాలు షాక్‌కు గురైంది. తాను అలాంటి దాన్ని కాదని చెప్పింది. తండ్రిలాంటి వారు మీరు ఇలా మాట్లాడటం సరికాదంది. అయినా కూడా బుద్ధిలేని డాక్టర్ తండ్రి అనే పదాన్ని పదినిమిషాలు పాటు పక్కన పెట్టి… తనతో గడపాలన్నారు. దీంతో ఆగ్రహించిన బాధితుారలు… తన కుటుంబసభ్యులతో కలిసి కీచక డాక్టర్‌కు బుద్ధి చెప్పింది. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.

అయితే డాక్టర్ రవీంద్రపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడంతో… ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయినా కూడా రవీంద్రలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్దలతో పరిచయాలు, పలుకుబడితో మరోసారి పోస్టింగ్ పొందాడు. తన వంకరబుద్ధి మార్చుకోకుండా మరోసారి ఆడవాళ్లపై తన పైశాచికత్వం ప్రదర్శించాడు. దీంతో ఇప్పుడు మరోసారి రవీంద్ర చేసిన పాడుపనులపై ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.

Tags : nellore , doctor , crime news , ap news ,

Related posts

Leave a Comment