నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు నోటీసులు… ఉరి వేసేది ఎప్పుడు?

ఢిల్లీ నిర్భయ కేసులో దోషులకు ఉరి వేయాలనుకున్న కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టడంతో… ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టాలంటూ… కేంద్రం పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై ఈ కేసులో దోషులైన నలుగురికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిజానికి ఈ కేసులో దోషులకు ఉరి అంశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. దాంతో ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ… కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు… కింది కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే… ఉరి ఎప్పుడు వెయ్యాలో నెక్ట్స్ డేట్ ఫిక్స్ చెయ్యమని ట్రయల్ కోర్టును కేంద్ర అధికారులు కోరవచ్చని తెలిపింది. సో, ఇప్పుడు ట్రయల్ కోర్టు నిర్ణయం కీలకం కాబోతోంది.

వాయిదా ఎందుకు వేసిందంటే : నిర్భయ దోషులు… ఒకరి తర్వాత ఒకరుగా క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటుంటే… అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటూ… శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. నలుగురు దోషులకూ ఒకేసారి ఉరి వెయ్యాలన్నది సుప్రీంకోర్టు 2017లో ఇచ్చిన తీర్పు. అలా కాకుండా…. అభ్యర్థన పిటిషన్లు లేని వారికి ముందుగా ఉరి వేసేస్తామని కేంద్రం కోరగా… అందుకు ట్రయల్ కోర్టు ఒప్పుకోలేదు. అందరికీ ఒకేసారి ఉరి వెయ్యాలనడంతో… ఇప్పటికే రెండుసార్లు ఉరి శిక్ష అమలును వాయిదా పడింది. తాజాగా ముగ్గురి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొట్టివేశారు. అందువల్ల నాలుగో వ్యక్తి పవన్ గుప్తా… ఇప్పటివరకూ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదు. అలాగే సుప్రీంకోర్టులో క్యూరేటివ్ ప్లీ కూడా వేయలేదు. అందువల్ల నలుగురికీ కలిపి ఇప్పుడు ఒకేసారి ఉరి వేసేందుకు ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు నెక్ట్స్ డేట్ ఎప్పుడంటే అప్పుడు ఉరి వేయవచ్చు.

నిర్భయ తల్లిదండ్రులు తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. నలుగురు దోషులకూ ఉరి వేయాల్సిందిగా కొత్త తేదీని ప్రకటించాలని కోరారు. తాజాగా కేంద్ర అధికారులు ట్రయల్ కోర్టులో అభ్యర్థన పెట్టుకుంటే… డేట్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. తీహార్ జైలు అధికారులు కూడా కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. నలుగురు దోషులకూ ఒకేసారి ఉరి వేసేందుకు అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు చేశారు.

Tags : crime , delhi , nirbhaya case

Related posts

Leave a Comment