హైదరాబాద్‌లో దారుణం… ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాల్‌ కేశంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి ,నిఖిత భార్యాభర్తలు. వీరికి యత్వంత్ రెడ్డి అనే రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కొంత కాలంగా బీఎన్‌రెడ్డినగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వెంకట్‌రెడ్డి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. వచ్చిన జీతం చాలాక…. కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు వీరి కుటుంబం బాధపడుతుంది. దీంతో భార్యభర్తలిద్దరూ కుంగిపోయారు. ఎవరి దగ్గర చేయిచాచి అడుగుతాంలే అనుకున్నారు. తమలో తమే మదనపడ్డారు. తమ కష్టాన్ని కన్నవాళ్లకు సైతం చెప్పుకోలేదు. ఇద్దరు కుంగిపోయారు. బతకలేక చావాలనుకొని నిశ్చయించుకున్నారు. దీంతో కలిసి నిండు నూరేళ్లు బతకాల్ని ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

మంగళవారం ఇంట్లోనే…ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నారు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ లేఖ రాశారు. జీవించడం ఇష్టంలేకనే.. చనిపోతున్నామన్నారు. తమ బిడ్డను బాగా చూసుకోవాలన్నారు. దయ చేసి ఎవరూ బాధపడకండి అంటూ… ఆ దంపతులురాసిన సూసైడ్ నోట్ చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ తల్లిదండ్రులు ఏమైందో కూడా తెలియని పసివయసులో ఉన్న రెండేళ్ల చిన్నారిని చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. అనంతరం బంధువులకు అప్పగిస్తామన్నారు.నిన్నటివరకు తమతో పాటు కలిసి ఉండేవాళ్లు… అనుకోకుండా ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో.. చుట్టుపక్కలవాళ్లు, ఇరుగు పొరుగున ఉన్నవాళ్లు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాలు ఎదురైతే ధైర్యంగా నిలబడాలని… ఇలా ఆత్మహత్య చేసుకోవడం సరికాదని చెబుతున్నారు.

Tags : crime news , Hyderabad , suicide , Telangana

Related posts

Leave a Comment