జాను కలెక్షన్స్.. పని చేయని సమంత, శర్వానంద్ మాయ..

సమంత, శర్వానంద్ జంటగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా జాను. తమిళనాట చరిత్ర సృష్టించిన 96 సినిమాకు రీమేక్ ఇది. అక్కడ క్లాసిక్ అనడంతో ఇక్కడ కూడా సూపర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేసారు కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే మాత్రం అలా జరగడం లేదు. ఈ చిత్రం ఓపెనింగ్స్ కూడా నిరాశజనకంగానే ఉన్నాయి. ముఖ్యంగా మూడు రోజుల తర్వాత జాను పరిస్థితి డైలమాలో పడిపోయింది. దిల్ రాజు నమ్మిన మ్యాజిక్ ఇక్కడ రిపీట్ కావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది జాను. తొలిరోజు నుంచే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బి,సి సెంటర్స్‌లో వసూళ్ల వేటలో బాగానే వెనకబడిపోయింది.

వీకెండ్ కలెక్షన్స్ చూస్తుంటే జాను పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.60 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా బిజినెస్ దాదాపుగా 19 కోట్ల వరకు జరిగింది. అయితే ఇప్పటి వరకు వస్తున్న వసూళ్ళు మాత్రం నిరాశనే కలిగిస్తున్నాయి. బయ్యర్లకు కూడా ఈ చిత్రం టెన్షన్ పెడుతుంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే జాను మరో 12 కోట్లు వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా అంత దూరం వెళ్లడం మాత్రం అసాధ్యమే. పైగా ఈ వారం వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ విజయ్ దేవరకొండ వస్తున్నాడు. ఫుల్ రన్‌లో ఈ సినిమా 12 కోట్లు వసూలు చేస్తే గొప్పే అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్న శర్వానంద్‌కు ఇది హ్యాట్రిక్ డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. జానుకు ముందు శర్వా నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’ సినిమాలు కూడి ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు జాను కూడా భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశనే మిగిలిస్తుంది. మంచి సినిమా అనే పేరు అయితే తెచ్చుకుంది కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం జాను అంచనాలు అందుకోవడం లేదు. దిల్ రాజు తెలుగు వర్షన్‌లో కొన్ని మార్పులు చేయాలని సూచించినా కూడా దర్శకుడు ప్రేమ్ కుమార్ పట్టించుకోకపోవడం కూడా జానుకు నెగిటివ్ అయ్యింది అంటున్నారు విశ్లేషకులు.

Tags : Jaanu , Telugu Cinema , Tollywood

Related posts

Leave a Comment