జాతీయస్థాయిలో తెలంగాణ మరో రికార్డ్

తెలంగాణ రాష్ట్రం మరో విషయంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. మొక్కల పెంపకంలోనూ తెలంగాణ నెంబర్‌వన్ గా నిలిచిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మొక్కల పెంప‌కంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింద‌ని కేంద్ర అట‌వీ శాఖ గణాంకాలు వెల్లడించడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయన అట‌వీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపారు. మొక్కల పంప‌కం, అట‌వీ పున‌రుజ్జీవ‌నం, అట‌వీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం చేప‌డుతున్న అట‌వీ ర‌క్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.

ఆకుప‌చ్చ తెలంగాణ సాధ‌న ల‌క్ష్యానికి చేరువ‌లో ఉన్నామ‌ని, అధికారులు, సిబ్బంది మ‌రింత కష్టపడి ఆ దిశగా ప‌ని చేయాల‌ని అన్నారు. రానున్న రోజుల్లో అట‌వీ పున‌రుజ్జీవ‌నంపై మ‌రింత దృష్టి పెట్టినట్టు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఆకుపచ్చ తెలంగాణకై కృషి చేస్తోన్న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్క నాటి సంర‌క్షించాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయ‌న పుట్టిన రోజును పురస్కరించుకుని మొక్కను నాటి కానుక‌గా ఇద్దామ‌ని అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం ఆదర్శనీయమన్నారు.

Tags : telangana , cm kcr , harithaharam , indrakaran reddy

Related posts

Leave a Comment