పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి…విద్యార్థి జేఏసీ

రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. లేకపోతే పవన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. పవన్ మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని పవన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడింది. న్యాయరాజధానిపై పవన్ వైఖరేంటో తెలపాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. సుగాలి ప్రీతి కేసు నిందితులను శిక్షించాలని మొదటి నుంచి తాము పోరాటాలు చేస్తున్నామని పేర్కొంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఖబడ్దార్ అని రాయలసీమ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.

Tags : rayalaseema student jac , pavan kalyan , janasena ,

Related posts

Leave a Comment