కేజ్రీవాల్‌కు ప్రేమికుల రోజుతో విడదీయరాని బంధం

ఢిల్లీలో మరోసారి చీపురు ఉడ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీని సైతం పరుగులు పెట్టించి దేశ రాజధానిలో తన సత్తా చాటింది. సరిలేరు నాకెవ్వరూ అంటూ… అరవింద్ కేజ్రీవాల్…. ఢిల్లీ పీఠాన్ని మరోసారి చేజెక్కించుకున్నారు. మరో మూడు రోజుల్లో అంటే… ప్రేమికుల దినోత్సవం రోజున కేజ్రీ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కేజ్రీకి… వాలెంటైన్స్ డేకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అదేంటో కానీ.. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాలన్నా… రాజీనామాలుచేయాలన్న కూడా అదే రోజును ఎంచుకుంటారు.

2013 లో తొలిసారిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. బిజెపి 31, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు గెలుచుకోగా… కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. ఆప్ కాంగ్రెస్ తో చేతులు కలిపి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 28 న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఏర్పడిన కేవలం 49 రోజుల్లోనే కూలిపోయింది. దీని తరువాత కేజ్రీవాల్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక విషయం ఏమిటంటే, కేజ్రీవాల్ 14 ఫిబ్రవరి 2014 న ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత 2015 లో ఎన్నికలు ప్రకటించారు. మరోసారి కేజ్రీవాల్ తన సత్తా చాటారు. మొత్తం 67సీట్లు సాధించారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. దీంతో ఆప్ ప్రతినిధి రాఘవ్ చాధా ఫిబ్రవరి 14 న రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. ఏరోజైతే పదవికి రాజీనామా చేశారో.. మళ్లీ అదే రోజు కేజ్రీవాల్ ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 2015 న రెండవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే 2018 లో, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా… కేజ్రీవాల్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేసారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం కూడా ఫిబ్రవరి 14 న అంటే వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యిే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఈ రోజును చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫిలితాలు కూడా ఫిబ్రవరి 11న రావడంతో… ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags : Aravind Kejriwal , delhi elections 2020 , Valentines Day 2020

Related posts

Leave a Comment