ప్రముఖ నేతల భద్రతను తొలగించిన ప్రభుత్వం… టీడీపీ నేతలు ఆందోళన

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేతల భద్రతను ప్రభుత్వం తొలగించింది. భద్రతను తొలగించిన వారిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగించామని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ భద్రత తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు.. సమాచారం లేకుండా ఉన్నపళంగా భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రత కొనసాగించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత భద్రతను కుదించి.. ప్రస్తుతం పూర్తిగా తొలగించడంపై నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లకుండా నిలువరించేందుకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని నేతలు పేర్కొంటున్నారు.

Tags : tdp ap , ap cm jagan , ap news , cm jagan mohan reddy ,

Related posts

Leave a Comment