ఉల్లిధర క్వింటాల్‌కు రూ. 2,000 చేరిక!

దేశాన్ని కుదిపేసిన ఉల్లిధరలు పూర్తిగా దిగివస్తున్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భారీఎత్తున దిగుమతులు పెరిగిపోవడంతో ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హోల్‌సేల్‌ మార్కెట్‌లలో క్వింటాల్‌కు 2000 నుంచి 2500 రూపాయలకు చేరింది. రిటైల్‌ మార్కెట్‌లోనూ కిలో ఉల్లిగడ్డ 25 నుంచి 30 రూపాయలకు దిగి వచ్చింది. ఒక దశలో ఏకంగా కిలో 200 రూపాయలు పలికిను ఉల్లిగడ్డ ప్రస్తుతం భారీగా తగ్గింది. హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లయిన మలక్‌పేట,బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌తో పాటు బేగంబజార్‌కు భారీ ఎత్తున ఉల్లిదిగుమతి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఉల్లి నగరానికి దిగుమతి అవుుతోంది. దాంతో పాటు కర్నాటక నుంచి కొంత మేరకు ఉల్లి అవసరాలు తీరుస్తున్నాయి. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ ఉల్లి దిబడి బాగా పెరిగింది. నగరానికి భారీఎత్తున దిగుమతి పెరిగిన కారణంగానే ధరలు బాగాపడిపోయినట్టు వ్యాపారులు తెలిపారు. గత వారం రోజుల క్రితం వరకూ క్వింటాల్‌కు 4000 నుంచి 3500 రూపాయల వరకు పలికిన ఉల్ల ధరలు బాగా పడిపోయి ప్రస్తుతం 2000 నుంచి 2500లకు చేరింది. దీంతో రిటైల్‌ మార్కెట్‌ లో ధరలు కిలోకు 20 నుంచి 25 రూపాయల వరకు అమ్ముతున్నారు. మొత్తానికి దాదాపు ఆరు నెలల పాటు దేశ ప్రజలను గడగడలాడించిన ఉల్లి ధరలు ప్రస్తుతం బాగాపడిపోవడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tags : onion price , india , onion price down , hyderabad , telangana ,

Related posts

Leave a Comment