కర్నూలులో ఓటర్ లిస్టులో వెంకటేష్…

ఎలక్షన్ కమిషన్‌ రిలీజ్ చేసి ఓటర్ జాబితాల్లో కొన్ని కొన్ని సార్లు భయంకరమైన తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ జాబితాలో హీరో వెంకటేష్ ఫొటో ఉంది. కర్నూలులోని 31వ వార్డులో ఓటరు పేరు రాణి కూమరొలూ అని ఉంది. తండ్రి / భర్త పేరు బాలు కూమరొలూ. ఇంటి నెంబర్ 83/54a. వయసు 20 సంవత్సరాలు. లింగము : స్త్రీ అని రాసి ఉంది. అయితే, పక్కన ఫొటో మాత్రం వెంకటేష్ ఫొటో ఉంది. ఓటర్ కార్డు నెంబర్ ZGF3524139. హీరో వెంకటేష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటాడు. తెలంగాణలో ఓటర్. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటర్ లిస్టులో ఫొటోలు అప్‌లోడ్ చేసే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.

Tags : Andhra Pradeshap , local body elections , Election Commission of India , Kurnool , Venkatesh

Related posts

Leave a Comment