ఒకే వేదికపై హిందూ, ముస్లిం వివాహాలు

ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంటలు ఏకమై మతసామరస్యాన్ని చాటిన సందర్భం గుజరాత్ లో చోటుచేసుకుంది. ఈషా పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా తాము ఈ తరహా వివాహాలను జరుపుతున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.

వివరాలను పరిశీలిస్తే.. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒకే వేదికపై హిందూ, ముస్లిం మతాలకు చెందిన 1100మంది వధూవరులు వివాహ బంధంతో ఒక్కటయ్యారని ఈషా ఫౌండేషన్ ట్రస్ట్ ప్రకటించింది. వివాహ తంతు ముగిసిన తర్వాత ఈషా ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు హిందువులకు అతి పవిత్రమైన గ్రంథం భగద్గీత, ముస్లింలకు అతి పవిత్రమైన గ్రంథం ఖురాన్ గ్రంథాలను కొత్త దంపతులకు బహుమతిగా అందించారు.

Tags : Hindu , Muslim , At On Dias Marriages , Gujrat , Eesha Foundation

Related posts

Leave a Comment