ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో షాక్… ఫైబర్ నెట్ ధరల పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్-APSFL టారిఫ్‌ను పెంచింది. ఒకేసారి రూ.50 టారిఫ్‌ను పెంచింది ఏపీఎస్ఎఫ్ఎల్. ప్రస్తుతం కనీస టారిఫ్ రూ.149 కాగా, దానికి ఎల్ఓటీ బాక్స్, జీఎస్‌టీ కలిపి రూ.235 వసూలు చేస్తోంది. ఇప్పుడు ఇది మరింత భారంగా కానుంది. మరో రూ.50 అదనంగా వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నిర్ణయించింది. వీటికి ట్యాక్స్ కూడా కలిపితే కనీస ఛార్జీలు నెలకు రూ.300 చెల్లించాల్సి వస్తుంది. కొత్త టారిఫ్ ఇదే నెలలో అమలులోకి రానుంది. ఫైబర్ నెట్ టారిఫ్ పెంపు భారం 10 లక్షల మంది యూజర్లపై పడనుందని అంచనా. ఇప్పటివరకు ఏపీ ఫైబర్ నెట్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు యూజర్లు. ఇప్పుడు టారిఫ్ పెంచడంతో ప్రైవేట్ ఆపరేటర్లతో సమానంగా టారిఫ్ ఉండబోతోంది.

బేసిక్ టారిఫ్ రూ.149. ఈ ప్యాకేజీలో 250 ఛానెల్స్ చూడొచ్చు. నెలకు 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 15 జీబీ డేటా లభిస్తుంది.హోమ్ ఎసెన్షియల్ టారిఫ్ రూ.299. ఈ ప్యాకేజీలో 250 ఛానెల్స్ చూడొచ్చు. నెలకు 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 50 జీబీ డేటా లభిస్తుంది.
స్టాండర్డ్ టారిఫ్ రూ.399. ఈ ప్యాకేజీలో 250 ఛానెల్స్ చూడొచ్చు. నెలకు 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటా లభిస్తుంది.ప్రీమియం టారిఫ్ రూ.599. ఈ ప్యాకేజీలో 250 ఛానెల్స్ చూడొచ్చు. నెలకు 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 200 జీబీ డేటా లభిస్తుంది.

బేసిక్ (సంస్థలు, ఆఫీసులు) టారిఫ్ రూ.999. నెలకు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 400 జీబీ డేటా లభిస్తుంది.స్టాండర్డ్ (సంస్థలు, ఆఫీసులు) టారిఫ్ రూ.1499. నెలకు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 800 జీబీ డేటా లభిస్తుంది.
ప్రీమియం (సంస్థలు, ఆఫీసులు) టారిఫ్ రూ.2499. నెలకు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ డేటా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లో ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రారంభించింది. తక్కువ ధరకే ఛానెళ్లతో పాటు ఇంటర్నెట్ డేటా అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

Tags :Andhra Pradesh , andhra pradeshd news , andhra updates , andhrapradesh , ap cm jagan , ap cm ys jagan mohan reddy

Related posts

Leave a Comment