సీఎం ఒక సైకో.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు

Chandrababu-Naidu-

సీఎం జగన్ ఒక సైకో అని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతిని రాజధానిగా ఎవరైనా వొద్దంటారా అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చరిత్రలో జరగని సంఘటనలని.. విధ్వంసకర కక్ష సాధింపు చర్యలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత వరకు అధికారులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.

సీనియర్‌ ఆఫీసర్‌ని సస్పెండ్‌ చేయడం దుర్మార్గమన్నారు. ఎంత మంది ఆఫీసర్లని సస్పెండ్‌ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎంతమంది తెల్లరేషన్‌ కార్డుదారులపై సీఐడీ ఎంక్వైరీ వేస్తారని నిలదీశారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలనా.. ఎవ్వరూ భయపడరని వెల్లడించారు. మీది చేతగాని పరిపాలన.. దద్దమ్మ పరిపాలన అని చంద్రబాబు దుయ్యబట్టారు. అన్నీ తప్పుడు పనులు చేసి.. తిరిగి తమ పైనే దాడి చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags : ap cm ys jagan , ap news , chandrababu , naralokesh , tdp

Related posts

Leave a Comment