తిరుమలలో నకిలీ టికెట్లతో మోసం.. ముఠా గుట్టు రట్టు

నకిలీ అభిషేకం, సుప్రభాత సేవా టికెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్ వింగ్ అధికారులు రట్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 18 అభిషేకం, 10 సుప్రభాతసేవకు సంబంధించిన కలర్ జిరాక్స్ టికెట్లను చెన్నైకు చెందిన దళారీ 73000 వేలకు అమ్మారు.

నకిలీ టికెట్లతో డిసెంబర్ మాసంలో అభిషేకానికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద విజిలెన్సు తనిఖీలలో నకిలీ టిక్కెట్లగా గుర్తించడంతో సదరు టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. భక్తుల ఫిర్యాదు మేరకు దళారీపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags : thirumala , fake tickets , thirupathi ,

Related posts

Leave a Comment