టీఆర్ఎస్, బీజేపీల మధ్య చిచ్చు రేపుతున్న అంతర్గత ఒప్పందం!

నల్లగొండ : జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం చిచ్చు రేపుతోంది. వైస్ చైర్మన్ ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర నేత బండారు ప్రసాద్ మండిపడ్డారు. నల్లగొండ వైస్ చైర్మన్ పదవి తమకు ఇప్పిస్తామని టీఆర్ఎస్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన ఒప్పందాన్ని టీఆర్ఎస్ నేతలు ఉల్లఘించారన్నారు. ఒప్పందంపై జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మరో నేత కంచర్ల కృష్ణారెడ్డి సంతకం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. చైర్మన్ ఎన్నిక రోజే టీఆర్ఎస్ మోసపూరిత వైఖరి చూపిందని బండారు ప్రసాద్ మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తమకు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వలేదని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయమే వీళ్లకు ముఖ్యమన్నారు. నల్లగొండ టీఆర్ఎస్ నేతలు బోడి మల్లయ్యలా వ్యవహరించారని దుయ్యబట్టారు. నల్లగొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రశ్నించే గొంతుకలుగా బీజేపీ పనిచేస్తుందని బండారు ప్రసాద్ వెల్లడించారు.

Tags : trs , bjp , nalgonda , muncipal elections , telangana

Related posts

Leave a Comment