ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు రేపు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ఢిల్లీ ఎన్నిలక ప్రధాన అధికారి రణ్‌బీర్ సింగ్. కౌంటింగ్‌కు సంబంధించి మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈవీఎం సహా కౌంటింగ్‌కు సంబంధించిన సామాగ్రి కౌంటింగ్ సెంటర్లకు చేరిందన్నారు.ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం మొత్తం 10 నుంచి 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మరోవైపు ఫిబ్రవరి 11న యమునాపార్‌లోని నాలుగు చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. మొదట బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత EVM ఓట్లు లెక్కింపు జరుగుతుంది. తూర్పు జిల్లా అక్షర్ధామ్‌లోని ఈవీఎంల కోసం స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. షహదారా జిల్లా ఐటిఐ నంద్ నగ్రిలో మరో స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. కొన్ని ప్రాంతాల్లో సరైన స్థలం లేకపోవడం వల్ల, కొత్తగా నిర్మించిన భవనాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా ఈవీఎంలను భద్రపరిచారు.

ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఢిల్ల్లీ పోలీసులే కాకుండా, పారామిలిటరీ దళాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలింగ్ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వెలుపల మాత్రమే ఉండాలన్నారు. కౌంటింగ్ కు ఓ గంట ముందు అంటే ఉదయం ఏడు గంటలకు అభ్యర్థి మరియు పోలింగ్ ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతిసత్ారు. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఇక సీఎం కేజ్రీవాల్ పోటిచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓటింగ్ ముగిసిన తర్వాత పలు జాతీయ వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేశాయి. అందులో మెజారిటీ సర్వేలు ఆప్‌కే జై కొట్టాయి.2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా ఖాతా తెరవడం అనుమానమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

Tags : AAP , Aravind Kejriwal , Delhi Assembly Election 2020 , delhi elections 2020

Related posts

Leave a Comment