ఏపీ ప్రజలకు జగన్ షాక్… విద్యుత్ ఛార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వారికి యూనిట్‌కు 90 పైసలు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 500 యూనిట్లు పైబడి వాడిన వారికి రూ.9.05 నుంచి రూ.9.95 గా టారిఫ్ నిర్ణయించారు. ఏపీ వ్యవసాయ వినియోగదారులకు(ఆదాయపన్ను చెల్లించని వ్యవసాయదారులు, బెల్లం రైతులు, గ్రామీణ నర్సరీలకు) రూ.8,353.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించుటకు అంగీకారం తెలిపారు. ఆంద్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ , దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.14,349.07 ఆదాయం అవసరం అవుతుందని అంచనా వేశారు.
వినియోగదారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,893.48 కోట్లు ఆర్టికభారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థలు నికర లోటు రూ.10,060.63 కోట్లుగా నిర్దారించారు.మొత్తం 1.45 కోట్ల గృహ వినియోగదారులలో 1.35 లక్షల వినియోగదారులకు పెంచిన టారిఫ్ వర్తిస్తుంది.
ముఖ్యంగా ప్రభుత్వ,కార్పొరేట్ సంస్థలపై ఛార్జీలు భారం పడనుంది. పెంచిన విద్యుత్ చార్జీలు రూ.1300 కోట్లు భారం పడుతుంది.

Tags : Andhra Pradeshap , cm ys jagan mohan reddy , AP News , AP Politicspower cuts

Related posts

Leave a Comment