ఏపీలో ఉపరితల ద్రోణి…పలు ప్రాంతాల్లో వర్షాలు…

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. కోస్తా, ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. తమిళనాడు నుంచి కోస్తా తీరం మీదుగా, ఒడిశా వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడటంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోసర్తు వర్షం కురుస్తోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో చలిగాలులతో కూడిన వర్షం పడడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ప్రకాశం జిల్లా గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. అకాల వర్షాలతో రైతాంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పండించిన పంట పూర్తిగా తడిసి ముద్దయి పోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో పూర్తిగా కంది పంట పూర్తిగా దెబ్బతింది.

Tags : andhrapradesh , rain , ap rain ,

Related posts

Leave a Comment