హిందు దేవాలయాల అభివృద్ధికి నిధులడిగే హక్కు అక్బరుద్దీన్ ఓవైసీకి లేదు: రాజాసింగ్

హిందు దేవాలయాల అభివృద్ధికి నిధులడిగే హక్కు అక్బరుద్దీన్ ఓవైసీకి లేదని బీజేపీ నేత రాజసింగ్ పేర్కొన్నారు. గతంలో హిందువులు, గోవులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాకనే.. దేవాలయాల అభివృద్ధి గురించి అక్బర్ మాట్లాడాలన్నారు. పాతబస్తీలోని కాళిమాయ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని రాజాసింగ్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలో భాగంగానే ప్రగతిభవన్‌కు అక్బర్ వెళ్లారని ఆరోపించారు. తనపై ఉన్న హిందు వ్యతిరేక మచ్చను తొలగించుకోవటానికి అక్బర్ ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. కేసీఆర్ ఎంఐఎంకు కాకుండా.. రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవటానికి సీఎం సమయం ఇవ్వటం లేదని విమర్శించారు. ఎంఐఎం నాయకులకు మాత్రం అడగకుండానే సమయం ఇస్తున్నారన్నారు.

Tags : rajasing , bjp , mim , telangana

Related posts

Leave a Comment