హైదరాబాద్‌లో 9 మంది అనుమానితులు?

హైదరాబాద్‌ నగరంలో తొమ్మిది మంది కరోనా వైరస్‌ అనుమానంతో ఆస్పత్రులను ఆశ్రయించారు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇద్దరికి వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో మిగిలిన ప్రయాణికుల్లో ఎవరికైనా అనుమానం ఉంటే నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం ముగ్గురు ఎయిర్‌హోస్టె్‌సలను గాంధీ ఆస్ప్రతికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. వారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. ఫీవర్‌ ఆస్పత్రిలో మరో నలుగురు అనుమానితులు చేరారు. బీజింగ్‌ నుంచి సొంత పని మీద హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు చైనా దేశస్థులు అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రిలో చేరి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉండకుండానే వెళ్లిపోయారు. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల చైనా వెళ్లి వచ్చారు. వారు కూడా అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చారు.

Related posts

Leave a Comment