ఐటీ ఆక‌స్మిక దాడులు.. షాక్‌లో స్టార్ హీరో

ఆదాయ‌పు ప‌న్ను ( ఐటీ) శాఖ అధికారులు ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్ గ్రూప్ కార్యాలయంతో పాటు మాస్ట‌ర్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజ‌య్‌ని విచారించ‌డం త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారింది. కుడ్డలూర్ జిల్లాలోని నెయ్వేలిలో మాస్ట‌ర్‌ షూటింగ్ జరుగుతుండ‌గా, ఐటీ అధికారులు నేరుగా నెయ్వేలి వెళ్లి షూటింగ్ జరుగుతున్న చోటే విజయ్‌ను విచారించారు. ఐదు గంట‌ల పాటు అత‌నిని విచారించిన త‌ర్వాత నెయ్వేలి నుండి రోడ్డు మార్గం ద్వారా చెన్నైకి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. భారీ మొత్తంలో ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే అనుమానంతో ఏజీఎస్ గ్రూపునకు సంబంధించి 20 చోట్ల సోదాలు నిర్వ‌హించ‌డంతో పాటు నిర్మాణ సంస్థ నుంచి విజయ్‌కు ఎంత ముట్టింద‌నే దానిపై ఆరాలు తీసిన‌ట్టు తెలుస్తుంది. విజ‌య్‌ని అర్ధాంత‌రంగా లొకేష‌న్ నుండి తీసుకెళ్ళ‌డంతో మాస్ట‌ర్ షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. మ‌ళ్ళీ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే దానిపై క్లారిటీ లేదు. మదురైకి చెందిన నిర్మాత, ఫైనాన్షియర్ అంబు చెళియన్‌ను ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు.

Related posts

Leave a Comment