నేడు గద్దెలపైకి చేరుకోనున్న సమ్మక్క తల్లి

మేడారం మహా జాతర రెండో రోజూ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకోవడంతో జాతర తొలిఘట్టం పూర్తయింది. మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు. ముగ్గురు దేవతల రాకతో జాతర ప్రాంతం సంబురంతో తొణికిసలాడింది. సమ్మక్క తల్లి నేడు గద్దెలపైకి చేరుకోనుంది. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను పూజారులు తీసుకురానున్నారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్టించనున్నారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కకు సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. ఇక సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో స్థానిక ఎస్పీ గాల్లోకి కాల్పులు జరపనున్నారు. సమ్మక్క తల్లి రాకతో జాతర పతాక స్థాయికి చేరుకోనుంది. శుక్రవారం భక్తుల దర్శనాల తర్వాత శనివారం దేవతలు వన ప్రవేశం చేయనున్నారు. మేడారం భక్తులతో కిటకిటలాడుతుంది.

Related posts

Leave a Comment