నిన్న కూడా అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా చేశారు

చర్చ జరుగుతుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… అమరావతిని మార్చుతామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా అనలేదని చెప్పారు. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రతి చర్చను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

అమరావతిని కాపాడతామని సీఎం జగన్ స్పష్టం చేశారని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారని కన్నబాబు తెలిపారు. టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన ఆరోపించారు. నిన్న కూడా అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా చేశారని ఆయన విమర్శించారు.

Tags : Kannababu , YSRCP , Andhra Pradesh

Related posts

Leave a Comment