నాగబాబుకు షాకింగ్ రిజల్ట్స్.. జబర్ధస్త్‌‌‌తో తల పట్టుకున్న మెగా బ్రదర్..

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో ‘జబర్ధస్త్’. ఈ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.. యూట్యూబ్‌లో అంతకు
రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. గత ఏడేళ్లుగా ఈ షో అప్రతిహతంగా దూసుకుపోతుంది. అంతేకాదు ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు టాలీవుడ్ ఇండస్ట్రీవకి
పరిచయమయ్యారు. ఈ షోతోనే మెగా బ్రదర్ నాగబాబుకు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ మధ్యనే జబర్ధస్త్ కామెడీ షో నిర్వాహకులు మల్లెమాల వాళ్లతో ఏర్పడిన మనస్పర్ధల
కారణంగా నాగబాబు జడర్దస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోను ప్రారంభించారు. ఈ షోతో జబర్ధస్త్ కామెడీ పని
అయిపోయిందన్న కామెంట్స్ కూడా వినబడ్డాయి. ఈ షో కోసం నాగబాబు..తనతో పాటు మరికొంత మంది జబర్ధస్త్ నటలును తీసుకువెళ్లడం జరిగింది. తీరా ఈ ప్రోగ్రామ్ ప్రసారమయ్యే సరికి..
ప్రేక్షకులు ఈ షో చూసి జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగులు అదిరింది ప్రోగ్రామ్‌కు గట్టి షాకే ఇచ్చాయి. ఇక ఇటీవల వచ్చిన రేటింగ్స్ చూస్తే.. జబర్ధస్త్‌కు 5 నుండి 6 రేటింగ్స్ వచ్చాయి. ఇక ‘అదిరింది’కి మాత్రం కేవలం
0.5 రేటింగ్ వచ్చింది. ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో నాగబాబు నిర్మించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ‘ఆరెంజ్’ మాదిరిగా ఈ షో కూడా ఆయనను బెదరగొట్టిందని కొందరు
నెటిజన్లు సోషల్ మీడియా మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చిన తరువాత ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని చాలా మంది
భావించారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కు వస్తున్న భారీ రేటింగ్స్ చూస్తుంటే, ఆ షోలో మంచి స్కిట్స్ ప్రదర్శిస్తున్న పార్టిసిపెంట్స్ కు ఉన్న ఆదరణే ఇంకా షోను మంచి స్థాయిలో ముందుకు
నడిపిస్తుందని అంటున్నారు.

Tags : nagababu , jabardust , mega family , tv show , comedy show

Related posts

Leave a Comment