ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేశామన్నారు. కొత్త
జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక రాష్ట్రంలో రవ్వంత కూడా వ్యతిరేకత రాలేదని అన్నారు. కానీ ఏపీలో రాజధాని విషయంలో వ్యతిరేకత వస్తోందని ఎందుకనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని
కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఎన్నికల సందర్బంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా ఏపీ రాజధాని అమరావతిపై ఆయన మాట్లాడారు. ఏపీలో మూడు
రాజధానులు ఉండవచ్చునని సీఎం జగన్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా విమర్శలు, ఆందోళనలు జరగుతున్నాయన్నారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తు ఉద్యమాలు
చేస్తున్నారన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయని, ఎక్కడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ సక్సెస్‌ఫుల్‌గా పరిపాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్
అన్నారు. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వెల్లువవడంతో జగన్ విఫలమయ్యారనే రీతిలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో
ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, అందరినీ ఒప్పించి, మెప్పించి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కానీ ఏపీలో రాజధాని విషయంలో ఇంత ప్రజా వ్యతిరేకత రావడం… ప్రభుత్వ
వైఫల్యమనే రీతిలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

 

Tags : minister ktr , telangana , rajadhani , ap politics

Related posts

Leave a Comment