సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన సీఎం జగన్

కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను సీఎం జగన్ ప్రారంభించారు. స్థానిక లింగవరం రోడ్ లోని కే.కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును జగన్ తిలకించారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అనంతరం, జాతీయ ఎడ్ల పందాల పోటీలను ప్రారంభించిన జగన్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జగన్ తో ఆయన అభిమానులు, గ్రామస్తులు సెల్ఫీలు దిగారు.

Related posts

Leave a Comment