టీఆర్‌ఎస్‌కు బీజేపీ భయం పట్టుకుంది: ఇంద్రసేనారెడ్డి

టీఆర్‌ఎస్‌కు బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల్ని కిడ్నాప్‌ చేస్తున్నారని, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, పరకాలలో..బీజేపీ అభ్యర్థులను టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎంఐఎం, టీఆర్ఎస్‌ తోడు దొంగలని ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఎంఐఎం గుండాలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతున్నారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతోన్న ఏపీ సీఎం జగన్..తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి అన్నారు.

Related posts

Leave a Comment