మారియో అవతారంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం

ఢిల్లీ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన వీడియోలో ముఖ్యమంత్రి, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా కనిపించారు. వీడియో గేమ్ మారియోలో మారియో పాత్ర పోషించి, గత ఐదేళ్లలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.

ప్రభుత్వ విజయాలను వివరిస్తూ సాగిన ఈ ఆటలో మారియో రూపంలోని కేజ్రీవాల్ అనేక లెవెల్స్‌ను అధిగమించినట్లు కనిపించింది. తన ప్రఃభుత్వం గత ఐదేళ్ళలో సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు. మొహల్లా క్లినిక్స్, విద్యా రంగం మెరుగుదల, ఆరోగ్య సదుపాయాలు, సీసీటీవీల ఏర్పాటు, మహిళల భద్రత కోసం వీథి దీపాల ఏర్పాటు, ఉచిత వైఫై సదుపాయం వంటివాటిని ఆయన వివరించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి ‘‘సూపర్ కేజ్రీవాల్’’ అనే శీర్షికను పెట్టింది. తొలినాళ్లలో నిర్వహించిన ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం గురించి కూడా దీనిలో ఉంది

Related posts

Leave a Comment