బైక్‌పై ఇద్దరు వెళ్తే… ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి…

 

ఈ రోజుల్లో చాలా మంది బైక్ నడుపుతూ… హెల్మెట్ పెట్టుకుంటున్నారు. కొందరు మాత్రం… హెల్మెట్ పెట్టుకుంటే… జుట్టు పలచబడిపోతోందనీ, ఏదో ఇబ్బందిగా ఉంటోందనీ చెప్పుకుంటూ… హెల్మెట్
పెట్టుకోరు. మరికొందరైతే… తాము అసలు యాక్సిడెంటే చెయ్యమనీ, స్లోగా వెళ్తామనీ… అందువల్ల తమకు హెల్మెట్ అవసరమే లేదని అంటున్నారు. కానీ ఎవరు ఎంత జాగ్రత్త పడినా… ఇతరుల వల్ల
మనకు రోడ్డు ప్రమాదం జరిగే పరిస్థితులూ ఉంటాయి. అందువల్ల బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్ మస్ట్‌గా పెట్టుకోవడమే మంచిది. ఈ మంచిని మరింత పెంచుతూ… బైక్‌పై ఇద్దరు వెళ్తే… ఇద్దరూ హెల్మెట్
పెట్టుకోవాల్సిందే అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇంటి నుంచీ ఇద్దరు బయల్దేరితే… ఇద్దరూ హెల్మెట్ పెట్టుకుంటారు. అలా కాకుండా… ఏ రోడ్డుపైనో మరో వ్యక్తి బైక్ ఎక్కితే… అతని దగ్గర
హెల్మెట్ ఉండదు కదా. అతన్ని ఎక్కించుకున్నందుకు మీకు ఫైన్ తప్పదు. లిఫ్ట్ ఇచ్చినా ఇంతే. ఏటా ఇండియాలో బోలెడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేల మంది చనిపోతున్నారు. లక్షల
మంది గాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బైక్ ప్రమాదాల్లో 70 శాతం అనర్థాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఒక్కోసారి హెల్మెట్
పెట్టుకున్న వ్యక్తి ప్రమాదం నుంచీ బయటపడుతుంటే… వెనక కూర్చొని హెల్మెట్ పెట్టుకోని వ్యక్తి చనిపోతున్నారు. అందువల్ల ఇద్దరు బైక్ పై వెళ్తే… ఇకపై ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.

హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్లు ఉన్నాయి. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ రూల్ అమలవుతోంది. ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోనూ ఇవాళ్టి నుంచీ ఈ రూల్ అమల్లోకి వచ్చింది.
హెల్మెట్లు పెట్టుకోకపోతే… కేసులు రాసి, ఫైన్లు వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చలానాలు (ఈ-చలానాలు) ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ ఫైన్ చెల్లించాల్సింది బైక్ నడిపే వ్యక్తే. సో… వెనక కూర్చున్న వ్యక్తి
బాధ్యత కూడా బైక్ నడిపే వ్యక్తికే చెందుతుంది. రాచకొండ పరిధిలో ఆల్రెడీ వారం నుంచీ 263 కేసులు రాశారు. రూ.28,400 ఫైన్లు వేశారు. ఇప్పుడు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల
ప్రజలంతా… రెండు హెల్మెట్లు కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే… ప్రతీ ఇంట్లో కనీసం ఇద్దరు ఉంటూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో… ఇద్దరు కలిసి బైక్‌పై వెళ్తారు. అప్పటికప్పుడు హెల్మెట్
కొనుక్కునే బదులు… ముందుగానే మంచి క్వాలిటీ, మరీ ఎక్కువ బరువు లేకుండా, సౌకర్యవంతంగా ఉండే అదనపు హెల్మెట్ కొనుక్కుంటే… ఈ ఫైన్లు, ఈ ఛలానాలు చెల్లించాల్సిన పని ఉండదు.
ఐతే… ఈ రూల్… హైదరాబాద్‌లోనే ఎందుకు… తెలంగాణ అంతటా అమల్లోకి తేవచ్చు కదా… అన్ని జిల్లాల్లోనూ బైకులపై ఇద్దరేసి వెళ్తూనే ఉంటారుగా… అని కొందరు అడుగుతుంటే… రెండు హెల్మెట్ల
విధానం కరెక్టు కాదని అభ్యంతరం చెప్పేవారూ ఉన్నారు. పోలీసులు మాత్రం అందరూ ఈ రూల్ పాటించాల్సిందే అంటున్నారు.

Related posts

Leave a Comment