నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ‘దర్బార్’

 

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘దర్బార్’ .. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది. 4 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7.57 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 3.78 కోట్ల వసూళ్లను సాధించింది.

ఇక తమిళనాట 3వ రోజున అంటే జనవరి 11వ తేదీన ఒక్క రోజునే ఈ సినిమా 30 కోట్లను వసూలు చేయడం విశేషం. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ 4 నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ లాభాల బాట పట్టింది. రజనీ స్టైల్ .. మురుగదాస్ టేకింగ్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

Leave a Comment