తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ భోగి శుభాకాంక్షలు..

తెలుగు ప్రజలకు పెద్ద పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి. దీంతో పట్టణాల్లో ఉండే ప్రజలు పండుగ పూట తమ సొంత గ్రామాలకు వెళ్లి అక్కడ తమ ఇంట్లో పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఇదే
అదును చూసుకుని తెలుగు సినిమాలు కూడా సినిమాలను పెద్ద ఎత్తున విడుదలౌతుంటాయి. అందులో భాగంగా ఈ పండుగకు రెండు పెద్ద సినిమాలు విడుదలై అదరగొడుతున్నాయి. అది అలా
ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికగా.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి
శుభాకాంక్షలు అని తెలియజేశారు. తెలుగు ప్రజల పెద్ద పండుగగా భావించే సంక్రాంతి ని పురస్కరించుకొని ఎన్టీఆర్ తన అభిమానులకు పండుగ దినం ఉదయాన్నే బెస్ట్ విశెష్ చెప్పి ప్రత్యేకత
చాటుకున్నారు. ప్రస్తుతంఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న తెలుగు వీరుల కథ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. కాగా పండుగ సందర్భంగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఆయన కుటుంబ
సభ్యులతో కలిసి సంక్రాంతి ఘనంగా జరుపుకోనున్నారు. ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా… మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఉద్యమ
వీరులైన వీరిద్దరి పాత్రలకు కాల్పనికత జోడించి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్2తో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ జులై 30న
విడుదల కాబోతోంది.

Related posts

Leave a Comment