నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్‌..

అక్రమాస్తుల కేసు విషయమై నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కూడా హాజరయ్యారు. అయితే సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి.

సీఎం హోదాలో కోర్టుకు హాజరుకావడంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. రెండు గంటల పాటు జగన్‌ కోర్టులోనే ఉండనున్నారు. గత ఏడాది మార్చి నుంచి జగన్‌ కోర్టుకు హాజరు కావడం లేదు. సీబీఐ కోర్టు జడ్జి ఆదేశంతో కోర్టుకు జగన్‌ హాజరయ్యాడు. సీబీఐ కోర్టు జడ్జి తదుపరి ఆదేశంపై వైసీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Related posts

Leave a Comment